In Mydukur, silos on roads are dangerous, same situation on road bridges: AV Ramana, Rythu Seva Samiti.
In Mydukur, silos on roads are dangerous, same situation on road bridges: AV Ramana, Rythu Seva Samiti.
మైదుకూరులో ప్రమాదకరంగా రోడ్లలో గోతులు, రహదారి వంతెనలపైనా అదే పరిస్థితి : ఎ వి రమణ, రైతు సేవా సమితి.
సహాయ న్యూస్ : మైదుకూరు (mydukur) పట్టణంలోని నాలుగు ప్రధాన (roads) రోడ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ హైవే, రోడ్లు భవనాల శాఖ ఆధీనంలో ఉండడంతో బ్రిజ్జిలు, రోడ్లుగుంతల మయంతో ప్రజలు ప్రమాదంలో ఉన్న స్పందించే నాథుడే లేడని, మైదుకూరు రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు.
ఈ రోజు మైదుకూరు(mydukur) పట్టణం బద్వేల్
రోడ్డు లోని మార్కెట్ సర్కిల్ సహకార బ్యాంక్ దగ్గర ఉన్న దెబ్బతిన్న బ్రిడ్జిని,
మైదుకూరు పట్టణ రైతు సేవాసమితి నాయకులు కె.రామ్మోహన్, దాశరెడ్డి గారి
సుబ్బరాయుడు, మిద్దె వెంకటేష్ లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎ. వి. రమణ
మాట్లాడుతూ, గత రెండు నెలలుగా బ్రిడ్జిలు దెబ్బతిని ప్రమాదంలో ఉన్న పాలకులు గాని, అధికారులు గాని స్పందించలేదని,
మైదుకూరు(mydukur) పట్టణంలోని నాలుగు ప్రధాన రోడ్లు(roads) నేషనల్, రోడ్డు భవనాల శాఖల ఆధీనంలో
ఉండడంతో సంబందిత అధికారులు కేవలం
దుమ్ముదూలి క్లీన్ చేసుకునే వరకే పరిమితం అవుతున్నారని అన్నారు.
అలాగే ప్రధాన రోడ్ల(roads) సైడ్ ఉన్న డ్రైనేజీ కాలువలను వ్యాపారులు పూర్తిస్థాయిలో ఆక్రమించి, డ్రైనేజ్ దాటి పది నుంచి 20 అడుగులు మేర రోడ్లు(roads) ఆక్రమించినా ఎవ్వరూ స్పందించకపోవడంతో, ప్రజలు ప్రధాన (roads)రోడ్ల పైన ప్రయాణం చేయాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నారని, కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖ లైన నేషనల్ హైవే ,ఆర్ అండ్ బి.ఆధికారులు వెంటనే స్పందించి మైదుకూరు(mydukur) పట్టణంలో ప్రధాన(roads) రోడ్ల పైన ఉన్నటువంటీ గోతులను పూడ్పించాలని, వంతెనల డ్యామేజ్లను పరిశీలించి మరమ్మతు చర్యలు చేపట్టాలని కోరారు.
మైదుకూరు (mydukur) పట్టణ, ఆయా ప్రాంతాల ప్రజల, వాహన దారుల అవస్థలు
గుర్తించి ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని, లేకపోతే రైతు సేవాసమితి పట్టణ
ప్రజలతో కలిసి దశలవారిగా, నిరసన
కార్యక్రమాలు చేపడతామని అయన తెలిపారు.


కామెంట్‌లు